సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): సామర్లకోటలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఎస్‌ఆర్‌సీ లాడ్జిలో అనూష, శిరి అనే ఇద్దరు చిన్నారులకు వాళ్ల తల్లిదండ్రులే కూల్‌డ్రింక్‌లో విషం ఇచ్చి చంపేశారు. వివరాలు.. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సత్యనారాయణ, గౌరమ్మ భార్యాభర్తలు. వీరికి అనూష(9), శిరీష(7) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు నిన్న(గురువారం) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎస్‌ఆర్‌సీ అనే లాడ్జిలో దిగారు.
రాత్రి 7 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తామని రిసెప్షన్‌లో చెప్పి వెళ్లారు. ఎంతసేపైనా రాకపోవడంతో శుక్రవారం ఉదయం రిసెప్షనిస్టు తలుపు తట్టి లోపలికి వెళ్లి చూడగా చిన్నారులు ఇద్దరూ విగత జీవులై పడి ఉన్నారు. విషయం బోధపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తల్లిదండ్రులే చంపేశారు..
Published Fri, Jun 23 2017 5:30 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
Advertisement
Advertisement