
సయ్యాటలో మునిగిపోయిన సర్పాలు
సాక్షి, అనంతపురం(బత్తలపల్లి): జిల్లాలోని గుమ్మల్లకుంట రైతు పోతుల రామకృష్ణారెడ్డి మామిడి తోటలో రెండు సర్పాలు సయ్యాట ఆడుతూ చూపరులను కనువిందుచేశాయి. మంగళవారం రెండు పాములు తోట నిర్జీవ ప్రదేశంలో పెనవేసుకొని సైయ్యాటలో మునిగి తేలుతున్నాయి. ఇది గమనించిన రైతు, రైతు కూలీలు అక్కడికి వెళ్లి పాముల సైయ్యాటను తిలకించారు. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు తీశారు. ఇవి ఇలా దాదాపు మూడు గంటలు పాటు ఉండిపోయాయి. అలజడి చేసినా అవి పట్టించుకోలేదు. చివరకు అవి సైయ్యాటలో మునిగిపోయి, కొద్ది సేపటికి వెళ్లిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment