
సాక్షి, అనంతపురం : చిన్న పాటి విషయం కాస్తా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన సంఘటన బుధవారం గుత్తిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ ఇబ్రహీం, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఎస్సీ కాలనీలో నారాయణ అనే వ్యక్తి ఇంటి పక్కన అదే కాలనీకి చెందిన శేఖర్ మనుషులు కూర్చొని సెల్‌ఫోన్‌లలో వీడియో గేమ్స్ ఆడటంతో పాటు మద్యం సేవిస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇక నుంచి ఇక్కడికి రావద్దని మందలించాడు. ఈ విషయం చినికి చినికి గాలి వానలా మారింది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ( కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం)
రాళ్లు, కట్టెలు, బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్ల దాడితో చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు. దాడిలో నారాయణతో పాటు వీరేష్, పరుశురామ్, హరికృష్ణ, వీరేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన శేఖర్‌తో పాటు అరుణ్, ఠాగూర్, తిరుమలేష్ (పొట్టి), అలివేలు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఇరు వర్గాలకు చెందిన పది మందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘర్షణ చోటు చేసుకున్న ఎస్సీ కాలనీని సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ ఇబ్రహీంలు పరిశీలించారు. ఇరు వర్గాలకు చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ( బావతో కలిసి భర్తను మట్టుబెట్టింది..)
Comments
Please login to add a commentAdd a comment