రెండు వోల్వో బస్సులు సీజ్ | two volvo buses were seized by transport officials | Sakshi
Sakshi News home page

రెండు వోల్వో బస్సులు సీజ్

Published Thu, Feb 26 2015 10:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

two volvo buses were seized by transport officials

నెల్లూరు: అనుమతి లేకుండా లగేజీ తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలో రోజు వారి తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో వస్తువులు తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను సీజ్ చేశారు. చెన్నై నుంచి వచ్చే బస్సులో తరచుగా అక్రమంగా వస్తువులను తరలిస్తుండటంతో అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. డిప్యూటీ రవాణా కమిషనర్ శివరాం ప్రసాద్ నేతృత్యంలో ఈ సోదాలు జరిగాయి. ఆరెంజ్, ధనంజయ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్‌చేశారు.
(తడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement