వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది.
గుంటూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల అయ్యింది. ఎన్నికల అధికారిగా సీనియర్ నేత, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు...పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను విడుదల చేశారు. ఇవాళ నామినేషన్ల స్వీకరణతో పాటు సాయంత్రం తుది జాబితా ప్రకటన చేస్తామన్నారు. అలాగే రేపు (ఆదివారం) సాయంత్రం జాతీయ అధ్యక్ష ఎన్నిక ఫలితాలు వెల్లడించనున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.
సర్వమత ప్రార్థనలు
కాగా అంతకు ముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు.
పార్టీ ప్రతినిధులతో ప్రమాణం
పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తామంటూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులతో ప్రమాణం చేయించారు.