ఎమ్మెల్సీకి ఉమ్మారెడ్డి నామినేషన్
వైఎస్సార్ సీపీ నాయకులతో కలసి డీఆర్‌ఓకు పత్రాలు అందజేత
తన విజయం తథ్యమని స్పష్టీకరణ
పట్నంబజారు స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు గురువారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, వినుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు, కిలారి రోశయ్య తదితరులు వెంటరాగా ఉదయం 11.15 గంటలకు ఉమ్మారెడ్డి తన నామినేషన్ పత్రాలను డీఆర్‌వో నాగబాబుకు అందజేశారు. అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను కలుపుకుని ముందుకు సాగటం జరుగుతోందని తెలిపారు. తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చే శారు.
జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు స్థానాలకు మాత్రమే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరిని ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి స్పష్టమైన ఓట్లు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించటం ఖాయమన్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ఉమ్మారెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, జలగం రామకృష్ణ, ఆతుకూరి ఆంజనేయులు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, చింకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.