కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం | unknown persons try to stolen childrens from Visakha KGH hospital | Sakshi
Sakshi News home page

కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం

Published Thu, Mar 6 2014 10:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం

కేజీహెచ్ పిల్లలవార్డులో దొంగల బీభత్సం

విశాఖ : విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో దొంగలు గురువారం బీభత్సం సృష్టించారు. సిబ్బందిని గాయపర్చి పిల్లలను ఎత్తుకు వెళ్లేందుకు  ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. సిబ్బందితో పాటు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిఘటించటంతో దొంగలు పరారయ్యారు. ఈ సందర్భంగా  పిల్లల బంధువులపై దుండగులు దాడికి ప్రయత్నించారు.

కాగా నిన్న మొన్నటి వరకూ పిల్లల వార్డులో  కుక్కలు యధేచ్చగా వీరవిహారం చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా పిల్లలనే ఎత్తుకు పోయేందుకు యత్నించటం కలకలం సృష్టించింది. ఇప్పటికైనా ఆస్పత్రి యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement