తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
తిరుమతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం, పలు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవారి సేవకులందరూ హిందూ ధర్మానికి కార్యకర్తల్లా పని చేయాలని ఆయన సూచించారు. సర్వ దర్శనంలో భక్తులందరికీ దర్శనం చేయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశినాడు అర్ధరాత్రి నుంచి వీఐపీ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.
ఉదయ ఐదు గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏకాదశి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు 31 వ తేదీ మధ్యాహ్నం నుంచి క్యూలైన్లోకి అనుమతి ఇస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం, ద్వాదశినాడు శ్రీవారి పుష్కరేణిలో చక్రస్నానం నిర్వహించునున్నట్లు సాంబశివరావు తెలిపారు.