తిరుపతి కార్పొరేషన్: ‘ఒక్కోసారి కీళ్లవాతం సమస్య ఏర్పడితే చక్కని నడకను కోల్పోవడం, ఇతర దీర్ఘకాలిక రోగాలు తలెత్తుతాయి. పైగా వారి దినచర్యలు దెబ్బతింటాయి. తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. అలాంటి వారికి రుమటాలజి కీళ్లవాతానికి అందించే ఆధునిక వైద్య విద్యావిధానంతో కీళ్లు, ఎముకల, కండరాల సమతుల్యం ద్వారా తిరిగి చక్కని నడక, ఆరోగ్యం కల్పించవచ్చు’ అని ప్రముఖ రుమటాలజి వైద్యులు డాక్టర్ పీ.దామోదరం తెలిపారు.
శనివారం ఆయన మాట్లాడుతూ కీళ్లు, ఎముకలు, కండరాల సమస్యల నివారణకు చక్కటి నడక, రోజూ వ్యాయామం చేయడం వలన కఠినమైన వ్యాధులు దూరం చేయవచ్చని తెలిపారు. చిన్నవయసులో కీళ్లవాతం వస్తే అది వారి చదువుతో పాటు వివాహ సమస్యలు, తీవ్ర మానసిక ఒత్తిడి, కుటుంబ పరంగా పలు సమస్యలకు దారి తీస్తుందన్నారు. కీళ్లవాతంలో ముఖ్యమైనది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అ న్నారు. ఇది ముఖ్యంగా నడివయస్సు కల్గిన స్త్రీలలో ఎక్కువగా వస్తుంటుం దని, జన్యువులు, హార్మోన్లు, ఇతర అంతుపట్టని కారణాలు ఈ వ్యాధికి కారణమన్నారు.
దేశంలో రుమటాల జిస్టులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలావరకు కీళ్లవాత రోగులు సరైన వైద్య సేవలు పొందలేక పోతున్నారని అన్నారు. ప్రాథమిక దశలోనే కీళ్లవాతం గుర్తించడం శులభమన్నారు. చేతివేళ్లు, కీళ్లు లేక మోకాళ్ల కీళ్లు, నడుములు, పాదాలు వాయడం లేక నొప్పి, ఉదయం సమయంలో కీళ్లు బిగిసుకుపోవడం వంటి లక్షణా లు కనిపిస్తే తక్షణమే రుమటాలజి వై ద్యుడిని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆయన సూచిం చారు.
ఇప్పటికే రాయలసీమలోనే మొదటిగా తిరుపతిలో శుభోదయ రుమటాలజి సెంటర్‌ను ఏర్పాటు చే సి, ఎన్నో జఠిలమైన కీళ్ల సమస్యలు, అరుదైన కీళ్ల వాత జబ్బులను నయం చేస్తున్నామని గుర్తుచేశారు. సెంటర్ ఏర్పాటు చేసి ఈ ఆదివారం నాటికి రెండు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. వందలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందించినట్టు తెలి పారు. వ్యాధ్రిగస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కీళ్ల వాతానికి ఆధునిక వైద్యం
Published Sun, Nov 2 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement