అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు | Venkaiah naidu takes on rahul gandhi and congress party leaders | Sakshi
Sakshi News home page

అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు

Published Fri, May 15 2015 12:11 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు

అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు

గుంటూరు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రపై కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో బీజేపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... అధికారం లేదనే కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశవ్యాప్తంగా 2 లక్షలమందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు చేయని పాదయాత్రలు ఇప్పుడెందుకు చేస్తున్నారని వెంకయ్య... కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నేపథ్యంలో వారిలో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ శుక్రవారం కిసాన్ సందేశ్ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో వెంకయ్యనాయుడుపై విధంగా స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement