'2019కాదుకదా 2090లోనూ మీకు పవర్‌ రాదు' | forget 2019 Cong will not be able to come in power even in 2090: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'2019కాదుకదా 2090లోనూ మీకు పవర్‌ రాదు'

Published Wed, Jan 11 2017 6:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

'2019కాదుకదా 2090లోనూ మీకు పవర్‌ రాదు'

'2019కాదుకదా 2090లోనూ మీకు పవర్‌ రాదు'

న్యూఢిల్లీ: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అధికారం విషయం మర్చిపోయి రాహుల్‌ గాంధీ అచ్చేదిన్‌ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా మంచి రోజులు (అచ్చేదిన్‌) ఏవి? ఎక్కడికెళ్లాయ్‌? అని అడుగుతున్నారని, 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, అప్పుడే మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. 'కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు(రాహుల్‌ గాంధీ) 2019లో మంచి రోజులు వస్తాయని అంటున్నారు. ఇది వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రాదనే విషయం మర్చిపోయారు. 2019 కాదుగదా 2090 అయినా కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడం షాకింగ్‌ అనిపించింది. వారి మాటలు చూస్తుంటే వారి దిగజారుడు తనం అర్థమవుతుంది' అని వెంకయ్య అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement