మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అర్హులైన వారందర్నీ ఓటర్లుగా చేర్చేం దుకు కలెక్టర్లు కృషి చేయాలని భారత ఎన్నికల కమిషనర్ వినోద్‌జుట్‌షి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌తో కలిసి ఆయన గురువారం జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల చేర్పులు తదితర అంశాలను సమీక్షించారు.
18 సంవత్సరాలు నిండిన వారందర్నీ ఓటర్లుగా నమోదు చేయటం, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ఓటర్లకు గుర్తింపు కార్డుల జారీ.. తదితర అంశాలపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన కలిగించి, ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు వివరించారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తయ్యిందని 48 కొత్త పోలింగ్ కేంద్రాలు, 70 పోలింగ్ కేంద్రాల స్థానం మార్చామని తెలియజేశారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు గిడ్డంగి నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు. జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించి 93,990 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగువేల మంది మైక్రో అబ్జర్వర్లు, 350 మంది సెక్టోరియల్ అధికారులను గుర్తించినట్లు చెప్పారు. సమావేశంలో జేసీ పి. ఉషా కుమారి, డీఐవో శర్మ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించండి
Published Fri, Sep 13 2013 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement