తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు.
తునిరూరల్ : తుని మండలం తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. సోమవారం ఆర్టీఏ, అగ్రికల్చరల్ మార్కెట్, రెవెన్యూశాఖ అధికారులతో కలిసి విజిలెన్సు అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు, వేబిల్లులు, ఎగుమతి, దిగమతి చేసే సరుకులను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించారు. జరిమానాల రూపంలో రూ.రెండు లక్షల ఆదాయం లభించిందని విజిలెన్స్ అధికారులు తెలిపారు.