సాక్షి, అమరావతి : ఫొని తుపాను సహాయ పనులు చంద్రబాబు నాయుడుకు సంబంధం లేకుండానే జరుగుతుండటంతో ఎల్లో మీడియా ప్రభుత్వ యంత్రాంగంపై బురద చల్లే వార్తలు కుమ్మరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తూ, టీడీపీ కార్యకర్తలతో తిట్టిస్తున్నారని ట్విటర్‌లో ధ్వజమెత్తారు.
'తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు. ఫొని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. ఫొని బీభత్సం వల్ల ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు. ఎటువంటి ప్రచార హడావుడి లేకుండా మూడు రోజులుగా అవిశ్రాంతంగా కష్టపడ్డారు. విద్యుత్ పునరుద్ధరణ, మంచినీటి సరఫరా అందజేసి ప్రజలు ఎవరిళ్లకు వారు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఓటమి ఫిక్సయి దిగిపోయే ముందు, పదవిపై అతిగా ఆశలు పెట్టుకున్న నాయకుడు- కోడ్ అమలులో ఉండగా సీఎస్‌తో పెట్టుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ మంచి పేరు తెచ్చుకున్నట్ట చరిత్రలో లేదు. ఉత్సవ విగ్రహాల హోదా కూడా కాదు. గోడపైన క్యాలెండర్ ఫోటో స్థాయే' అని ట్విటర్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment