
'విభజన చట్టంలోని ప్రతి హామీ అమలుకు ప్రయత్నిస్తాం'
గుంటూరు: విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు నగరంలో రమేష్ కార్డియాలజి ఆసుపత్రిని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లురుతోపాటు చుట్టుపక్క నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ రాజధాని ఏర్పాటవుతుందని అన్నారు.
విజయవాడ, గుంటూరు నగరాలలో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు మరన్ని రావాలని... అవి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని ప్రభుత్వమే చేయాలన్న ఆలోచన నుంచి జనం బయటకు రావాలని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు.