గట్టువద్ద తరికోట పేరుతో ఏర్పాటుచేసిన బోర్డు ,తాగునీటి పథకం ప్రారంభ శిలాఫలకంలో తరిగోడు పేరు , గ్రామశివారులో తరికోట పేరుతో బోర్డు
చిత్తూరు , బి.కొత్తకోట: ఊరిపేరు వల్లే తమకు అరిష్టం వస్తోందని ఆ గ్రామస్తులు..అనుమానం వచ్చిందే తడవుగా గ్రామస్తులే తమ ఊరి పేరును మార్చేశారు. గట్టు పంచాయతీలోని తరిగోడుకు శతాబ్దాల చరిత్ర ఉం ది. గట్టు ఈద్గా నుంచి లేదా దిన్నిమీదపల్లె నుంచి గ్రామానికి వెళ్లేందుకు రహదారులు ఉన్నాయి. 60 కుటుంబాలుంటున్నాయి. ఇటీవల 10 కుటుంబాలు వలస వెళ్లాయి. స్థానికంగా ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. 28 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉన్నకొద్డి ్దమంది వ్యవసాయంపై ఆధారపడే జీవి స్తున్నారు. తరిగోడులో 8నెలల్లో ఆరుగు రు చనిపోయారు. మృతులంతా 40ఏళ్లలోఫువారే. తాజాగా మరికొందరు అనారోగ్యం పాలయ్యారు. దీంతో గ్రామస్తుల్లో భయం అధికమైంది. గ్రామానికి ఏదో అరిష్టం జరిగి ఏదో పీడిస్తోందని భావించారు. ఊరి పేరులోని గోడు అనే పదం ఉండటం వల్లే ఇలా జరుగుతోందని ఒకరు సలహా ఇచ్చారు. మరికొందరు సిద్ధాంతులూ దీనిని సమర్ధించారు. అంతే వెంటనే గ్రామస్తులంతా తమ ఊరు పేరు మార్చేశారు.
అధికారిక రికార్డుల్లో తరిగోడు పేరుతోనే గ్రామం ఉంది. ఇప్పుడు ఆ పేరును తరికోటగా మార్చుకున్నారు. పూర్వకాలం ఇదే పేరు ఉండేదంటూ కొత్తపేరును బోర్డులో రాశారు. గ్రామ శివారులో, గట్టు వద్ద ప్రారంభమయ్యే గ్రామ రహదారిపై తరికోటకు దారి పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డుపై ఉన్న ఆలయాన్ని కూడా తరలించే చర్యలు చేపట్టారు. ఆలయంలో గుంత ప్రాంతంలో నిర్మించారని అందువల్ల తరలించడం లేదా మరమ్మతులు చేస్తామని గ్రామస్తులు చెప్పారు. పేరు మార్పు విషయమై గ్రామస్తులు ఇటీవల స్థానిక తహసీల్దార్ బలరాముడును కలిశారు. తరికోటగా పేరును మార్చాలని వినతిపత్రం అందించారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ రికార్డుల్లో తరిగోడు పేరే ఉందని స్పష్టం చేశారు. ఈ పేరును అధికారికంగా మార్చాలంటే కారణాలు, గ్రామస్తుల అభిప్రాయాల సేకరించి కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment