మూడు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ.. దర్శి మండలం ఎర్రబోనపల్లె గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు.
మూడు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ.. దర్శి మండలం ఎర్రబోనపల్లె గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో ఆర్ఐ సత్యమూర్తి గ్రామానికి చేరుకుని రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ చింతా వెంకటరమణారెడ్డి పరారయ్యాడు. ఇంతకు ముందున్న డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి తొలగించారు. అతని స్థానంలో వచ్చిన టీడీపీ కార్యకర్త రమణారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.