జమ్మిచెట్టు మీద అస్త్రాలు మీకే తగులుతాయి జాగ్రత్త! | Vishnu kumar raju takes on TDP leaders | Sakshi
Sakshi News home page

జమ్మిచెట్టు మీద అస్త్రాలు మీకే తగులుతాయి జాగ్రత్త!

Published Thu, Mar 12 2015 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

జమ్మిచెట్టు మీద అస్త్రాలు మీకే తగులుతాయి జాగ్రత్త!

జమ్మిచెట్టు మీద అస్త్రాలు మీకే తగులుతాయి జాగ్రత్త!

బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు
 సాక్షి, హైదరాబాద్: ‘‘జమ్మిచెట్టుమీద అస్త్రాలున్నాయి, అవి సంధించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కొంతమంది నాయకులు పదే పదే చెబుతున్నారు. కానీ ఆ అస్త్రాలు ప్రయోగించిన వారికే తగులుతాయన్న సత్యం మర్చిపోకండి అంటూ బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు శాసనసభలో పరోక్షంగా టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. మిత్ర ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తున్నామని, దీన్ని అసహాయతగా చూడటం సరికాదని హెచ్చరించారు.

బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా రైతులను నుంచి 60 రోజుల్లోనే భూములు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు భూసమీకరణలో భాగంగా అతి తక్కువ కాలంలోనే భూములు తీసుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లో ఎక్కాలి అని విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమపై చాలా సందేహాలున్నాయని, దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement