మొక్కలు నాటుతున్న కలెక్టర్ హరిజవహర్
సాక్షి, పూసపాటిరేగ (విజయనగరం): మొక్కలు నాటడంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ హరిజవహర్ తెలిపారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ మరమ్మతులకు గురవడంతో తక్షణమే బాగు చేయించాలని తహసీల్దార్ అప్పలనాయుడును ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 19,011 గృహాలు ఉండగా వాటన్నింటిని తనిఖీ చేసి ఆన్‌లైన్ చేసినట్లు తెలియజేశారు. వారిలో 5120 మంది గృహాలు అవసరమని గుర్తించారు. వారికి 90 ఎకరాలు అవసరం ఉండగా 17 ఎకరాలు వరకు గుర్తించినట్లు తెలియజేశారు.
13 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. డిప్యూటీ కలెక్టర్ సహకారంతో భూసేకరణ చేస్తామన్నారు. బీసీ వసతి వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.17 లక్షలు మంజూరు అయినట్లు తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మరలా ఎస్టిమేట్ వేసి నిధులు మంజూరు చేస్తాం అన్నారు. విజయనగరంలో 48 లక్షల వరకు మొక్కల నాటినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.ప్రకాశరావు, తహసీల్దార్ జి.అప్పలనాయుడు, సీఎస్‌డీటీ పిట్ట అప్పారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment