ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యార్థి కళాశాల నుంచి ప్రధాన వీధుల గుండా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వెంకటయ్య మాట్లాడారు. జిల్లాలో 1400 నుంచి 1600 యూనిట్ల రక్తం అవసరం అవుతుండగా.. 1100 యూనిట్లు మాత్రమే నిల్వ అవుతోందని అన్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు నుంచి తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగుల నుంచి రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో స్వామి, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంపూర్ణరావు, శ్యాంసన్, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు విజయ్‌కుమార్ డోక్వాల్, రాంచందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
డ్వామా ఆధ్వర్యంలో రక్తదానం
జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా డ్వామా ఆధ్వర్యంలో మంగళవారం కార్యాలయ ఆవరణలో రక్తదానం చేశారు. డ్వామా పీడీ వినయ్‌కుమార్‌రెడ్డి, ఉద్యోగులు 50 మంది రక్తదానం చేశారు. ఉద్యోగులు రమేశ్, రామకృష్ణ, మల్లేశ్, కృష్టారావు, రెడ్‌క్రాస్ ఆఫీస్ ఇన్‌చార్జి రాంచంద్ర మహాత్మే, సామాజిక కార్యకర్త బండారి దేవన్న పాల్గొన్నారు.
స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి
Published Wed, Oct 2 2013 2:18 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement