- ఆరు మున్సిపాలిటీల్లో360 నామినేషన్లు
- అత్యధికంగా మదనపల్లెలో 122 దరఖాస్తులు
- రంగంలోకి దిగిన ఎంఐఎం, బీఎస్పీ
- చిత్తూరు కార్పొరేషన్‌కు ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పలమనేరు, నగరి మున్సిపాలిటీల్లో నామినేషన్ల దాఖలుకు ఇక ఒక రోజే గడువు ఉండడంతో నాలుగో రోజు గురువారం నామినేషన్లు వేసేవారితో హడావుడి నెలకొంది. ఆరు మున్సిపాలిటీల్లో 360 నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు కార్పొరేషన్‌లో గురువారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు క్యూకట్టారు.
చివరిరోజు 200 వరకు నామినేషన్లు దాఖలయ్యూయి. కార్పొరేషన్ కార్యాలయంలోకి అభ్యర్థిని, మద్దతు తెలుపుతున్న ఇద్దరిని మాత్రమే అనుమతించారు. ఊరేగింపుగా వచ్చిన వారిని కలెక్టర్ బంగ్లావద్దే నిలిపేశారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. వైఎస్సార్ సీపీ నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం, ఆ తర్వాత స్థానంలో స్వతంత్రులు నిలబడ్డారు. కార్పొరేషన్‌లో కాంగ్రెస్ తర ఫున వేళ్లపై లెక్కపెట్టగల సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
నగరి మున్సిపాలిటీలో..
నగరి మున్సిపాలిటీలో నాలుగో రోజు వార్డులకు మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైఎస్సార్‌సీపీ నుంచి 25 మంది, టీడీపీ నుంచి 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్రులు ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు కౌన్సిలర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
పుత్తూరు మున్సిపాలిటీలో..
పుత్తూరులో 52 నామినేషన్లు దాఖలయ్యూయి. వైఎస్సార్‌సీపీ నుంచి 24, టీడీపీ నుంచి 23 నామినేషన్లు వచ్చాయి. ఐదుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు.
పుంగనూరులో...
పుంగనూరులో వివిధ పార్టీల అభ్యర్థులు కౌన్సిలర్ల పదవులకు 35 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో వైఎస్సార్ సీపీ నుంచి 17, టీడీపీ నుంచి 11 నామినేషన్లు దాఖలయ్యూయి. ఏడుగురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు.
శ్రీకాళహస్తిలో...
శ్రీకాళహస్తిలో 63 నామినేషన్ల వరకు దాఖలయ్యూయి. వైఎస్సార్ సీపీ నుంచి 11 మంది, టీడీపీ నుంచి 27 మంది నామినేషన్ వేశారు. సీపీఎం నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, స్వతంత్రులు 09 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
మదనపల్లెలో..
మదనపల్లెలో మొత్తం 122 నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి 34 మంది, టీడీపీ నుంచి 59 మంది నామినేషన్ వేశారు. అలాగే 23 మంది స్వతంత్రులు, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు.
పలమనేరులో..
పలమనేరులో మొత్తం 41 నామినేషన్లు వరకు దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి 18 మంది, తెలుగుదేశం నుంచి 10 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్రులు 13 మంది నామినేషన్లు అందజేశారు.