ధువపత్రాల కోసం నిరీక్షణ
ధువపత్రాల కోసం నిరీక్షణ
నెల్లిమర్ల, : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఏదైనా ధ్రువపత్రం కావాలంటే కార్యాలయం చుట్టూ నెలల తరబడి కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. మీసేవా కేంద్రం,నగర పంచాయతీ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు రోజూ తిరిగినా ప్రయోజనం లేక పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులకు అందాల్సిన బంగారుతల్లి, మృతుల కుటుంబాలకు అందాల్సిన సీఎం రిలీఫ్ పండ్, ఆపద్బందు పథకాలు అందకుండా పోతున్నాయి. నెల్లిమర్ల పరిధిలో మూడు ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రైవేట్ ఆస్పత్రి కాగా, మరొకటి మిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి. అలాగే నెల్లిమర్ల సీహెచ్‌సీతో పాటు సతివాడ, కొండవెలగాడలో పీహెచ్‌సీలు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రతినెలా సుమారు 2వేల ప్రసవాలు జరుగుతాయి. నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, విజయనగరం, బొండపల్లి మండలాలకు చెందిన వారు ఇక్కడే ప్రసవాలు చేసుకుంటారు. వీటికి సంబంధించిన జనన ధ్రువపత్రాలను నెల్లిమర్ల నగర పంచాయతీ