కాంగ్రెస్ ఎంపీల బహిష్కరణకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఆనందపేట(గుంటూరు) : ప్రతేక హోదా సాధన కోసం, పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల బహిష్కరణకు నిరసనగా జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం జిల్లా కాంగ్రెస్ నాయకులు స్థానిక హిందూ కళాశాల సెంటర్ వద్ద గల రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా సాధించలేని బీజేపీ,టీడీపీ రాష్ట్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పార్లమెంట్‌లో కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడాన్ని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రత్యేక హో దా సాధించడంలో బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు వణుకూరి శ్రీనివాసరెడ్డి, కూచిపూ డి సాంబశివరావు, సవరం రోహిత్, నూనె పవన్‌తేజ, దొంతా సురేష్, మదనమోహన్‌రెడ్డి, జిలాని, బిట్రగుంట మల్లిక, యర్రబాబు,చిన్న మస్తాన్‌వలి,చిలకా రమేష్, కరీముల్లా, మొగలి శివకుమార్, బాజి, ఉస్మాన్, రహెమాన్, యర్రంశెట్టి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు
ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అడ్డుగా నిలబడి మోడి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రత్యేక హోదా కోసం మోకాళ్లపై నడక
Published Wed, Aug 5 2015 2:19 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement