వావ్!
వాల్ షెల్ఫ్స్‌తో ఇంటికి సరికొత్త అందం
హైదరాబాద్: ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. మన సమాజంలో గృహాలంకరణే ఇల్లాలి ప్రతిభకు ప్రాతిపదిక. సొంతమైనా, అద్దె ఇళ్లయినా అందంగా ఉండాల్సిందే. సాదాసీదాగా ఉండే గోడలకు వివిధ రకాల డిజైన్లను చేర్చి అందాన్నే కాదు సౌకర్యవంతంగానూ మలచుకునే ఉపాయమే వాల్‌షెల్ఫ్స్. దీంతో పాతకాలపు ఇంటిని ఈ కాలపు అవసరాలు తీర్చేలా తీర్చిదిద్దుకోవచ్చు.
► వాల్‌షెల్ఫ్స్ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేసి ఉంటాయి. మన అవరాలతో పాటు ఇంటి కొలత లు తెలిస్తే చాలు తగ్గ సైజు, కావాల్సిన రంగును ఎంపిక చేసుకోవచ్చు కూడా.
► గోడకు చిన్న రంధ్రాలు చేసి వాల్‌షెల్ఫ్స్‌ను తేలిగ్గా అమర్చుకోవచ్చు. హాల్ నుంచి డ్రాయిండ్ రూమ్, కిచెన్, హాల్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌ల్లో కూడా వీటిని పెట్టుకోవచ్చు.
► వాల్‌షెల్ఫ్స్ అమర్చే గదిలో లగ్జరీ పార్సెలిన్ నుంచి నిర్మల్ బొమ్మల దాకా రకరకాల బొమ్మలతో అందంగా అలంకరించుకోవచ్చు.
► ఉడెన్‌తో పాటు వివిధ మెటల్స్‌తో లభ్యమయ్యే వాల్‌షెల్ఫ్స్ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి.
► నగరంలో ఇంటీరియర్ స్టోర్స్, హోమ్ నీడ్స్ స్టోర్‌లతో ఈ షెల్ఫ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సేవలందించే ఈ సెట్ల ద్వారా కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు.