వీరవరంలో మావోయిస్టుల సంచారం! | Wandering the in viravaram Maoists! | Sakshi
Sakshi News home page

వీరవరంలో మావోయిస్టుల సంచారం!

Published Tue, Sep 9 2014 2:56 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

వీరవరంలో మావోయిస్టుల సంచారం! - Sakshi

వీరవరంలో మావోయిస్టుల సంచారం!

జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. మండలంలోని ఎ.వీరవరం గ్రామంలో ఆదివారం నలుగురు మావోయిస్టులు సంచరించినట్టు సమాచారం.

దేవీపట్నం : జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. మండలంలోని ఎ.వీరవరం గ్రామంలో ఆదివారం నలుగురు మావోయిస్టులు సంచరించినట్టు సమాచారం. వారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామంలోని తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న చిట్టడవిలో మకాం వేశారని, బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ తుపాకులతో ఉన్న వారిని చూసి భయపడి నలుగురికీ చెప్పిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు చెపుతున్నారు. ఈ విషయంపై రంపచోడవరం ఏఎస్పీ విజయారావును వివరణ కోరగా  మావోయిస్టుల ఉనికిపై తమకూ సమాచారం అందిందని, గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement