విజయవాడ: కేంద్రంతో తమ సత్సంబంధాలు కొనసాగుతాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు రగిలించాలనే కుట్రకు టీడీపీ బలి కాదని తెలిపారు. టీడీపీ రాష్ట్ర సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై చర్చించామని చెప్పారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులు తమ పనితీరును మరింత మెరుగు పరచుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.