ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :
తెలంగాణ రాష్ర్టం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను అమోదించి న క్రమంలో శుక్రవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ఏక శిల పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద సుబ్బారా వు మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల పోరాటం, త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని తన్నుకు పోవడానికి సీమాంధ్ర గద్దలు సిద్ధంగా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముం దన్నారు. సమైక్యవాదులు సంయమనం పాటించి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్, రెవెన్యూ, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘాల జిల్లా అధ్యక్షు లు కోల రాజేశ్‌కుమార్, రత్న వీరాచారి, కుమారస్వామి, దాస్య నాయక్, నాగపురి ప్రభాకర్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, రత్నాకర్‌రెడ్డి, ధరంసింగ్, డి.శ్రీనివాస్, సోమ య్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలి
Published Sat, Oct 5 2013 6:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement