రాయల తెలంగాణపై సోనియాను కలుస్తాం:జేసీ
హైదరాబాద్: రాయల తెలంగాణ అంశంపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవాలనుకుంటున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాయల తెలంగాణ కోసం కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రయత్రిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తదితర విషయలపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తమకు ప్రత్యేక రాష్ట్రం అవశ్యం గురించి తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపకపోతే భవిష్యత్తులో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనిపై టీ.కాంగ్రెస్, టీఆర్ఎస్. బీజేపీ నేతలను కలిసినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేయకపోతే రాయలసీమ అసంతృప్తికి గురౌవుతుందన్నారు. రాయల తెలంగాణకు కోస్తాంధ్ర నేతలు కూడా సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు.