వీరఘట్టం:ఇంతకాలం గ్రామాల్లో సంక్షేమ పింఛన్ల పంపిణీ బాధ్యతను నిర్వర్తిస్తున్న కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్(సీఎస్పీ) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసింది. ఈ బాధ్యతలను డిసెంబర్ నుంచి అంటే సోమవారం నుంచి పోస్టల్ విభాగానికి అప్పగించడంతో జిల్లాలో సుమారు 400 మంది సీఎస్పీలు రోడ్డున పడ్డారు. గత ఎనిమిది నెలలుగా వీరితో పని చేయించుకున్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కపైసా అయినా చెల్లించకుండానే ఉద్యోగాల నుంచి తొల గించింది. వీరి నుంచి పింఛన్ల పంపిణీ యంత్రాలను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాబు వస్తే..
జాబొస్తుందన్న నినాదంతో ఎన్నికల్లో ఓట్లు పొంది గద్దెనెక్కిన టీడీపీ సర్కారు కొత్త ఉద్యోగాల సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగులను ఇళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందన్న విమర్శలు రేగుతున్నాయి. సీఎస్పీలే దీనికి తాజా ఉదాహరణ. ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లకు ప్రతి నెలా ఆయా లబ్ధిదారులకు అందజేయడంతోపాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికి వేతనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు బాధ్యతలను ఎనిమిది నెలల క్రితం సీఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు ప్రతిఫలంగా వారు పంపిణీ చేసిన మొత్తంలో ఒక శాతం కమీషన్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా 400 మంది సీఎస్పీలను నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఇంతవరకు ఏ ఒక్కరికీ పైసా అయినా కమీషన్ చెల్లించలేదు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తం సీఎస్పీల వ్యవస్థనే తొలగించాలని నిర్ణయించింది. పింఛన్ల పంపిణీ బాధ్యతను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ డాక్ వర్కర్స్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ కావడంతో జిల్లా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సీఎస్పీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా కమీషన్ ఇవ్వకపోయినా, ఈ ఉద్యోగాన్నే నమ్ముకున్న తమను ప్రభుత్వం ఉన్న పళంగా తొలగించి నట్టేట ముంచిందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ తనూజరాణితో ప్రస్తావించగా వాస్తవమేనని ధ్రువీకరించారు. సీఎస్పీలను తొలగించి పోస్టల్ డాక్ వర్కర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. క్రితం సీఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది.
ఇందుకు ప్రతిఫలంగా వారు పంపిణీ చేసిన మొత్తంలో ఒక శాతం కమీషన్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా 400 మంది సీఎస్పీలను నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కరికీ పైసా అయినా కమీషన్ చెల్లించలేదు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తం సీఎస్పీల వ్యవస్థనే తొలగించాలని నిర్ణయించింది. పింఛన్ల పంపిణీ బాధ్యతను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ డాక్ వర్కర్స్‌కు అప్పగించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ కావడంతో జిల్లా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సీఎస్పీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది నెలలుగా కమీషన్ ఇవ్వకపోయినా, ఈ ఉద్యోగాన్నే నమ్ముకున్న తమను ప్రభుత్వం ఉన్న పళంగా తొలగించి నట్టేట ముంచిందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ తనూజరాణితో ప్రస్తావించగా వాస్తవమేనని ధ్రువీకరించారు. సీఎస్పీలను తొలగించి పోస్టల్ డాక్ వర్కర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఎలా బతికేది
ఉద్యోగం నుంచి ఆకస్మికంగా తొలగిస్తే ఎలా బతికేది. యంత్రాల్లో సాఫ్ట్‌వేర్ లోడ్ చేస్తామని చెప్పి తీరా ఇప్పుడు మమ్మల్ని తీసేశామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మా పరిస్ధితి ఏంటి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.
- పూతి కుమారి, సి.ఎస్.పి, వీరఘట్టం
8 నెలలుగా పని చేస్తున్నాం
ఏప్రిల్ నుంచి పని చేస్తున్నాం. ఇంతవరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధాంతరంగా ఉద్యోగాలు ఊడగొట్టారు. ఇదే ఆధారంగా పని చేస్తున్నాం. మా గతేం కావాలి.
- దాసరి పుణ్యవతి,
సి.ఎస్.పి, వీరఘట్టం
సీఎస్పీలకు మంగళం
Published Mon, Dec 1 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement