గణేశ్వరరావు మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య, బంధువులు కుటుంబ సభ్యులతో కొచ్చెర్ల గణేశ్వరరావు (ఫైల్)
పాలకోడేరు: ఎన్నెన్నో ఆశలతో సముద్రాలు దాటి వెళ్లిన అతను విగత జీవిగా మారి ఇంటికి చేరుకున్నాడు. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గొరగనమూడి గ్రామానికి చెందిన కొచ్చెర్ల గణేశ్వరరావు (48) పొట్టకూటి కోసం నాలుగు నెలల క్రితం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లాడు. అక్కడ కష్టపడి సంపాదిస్తున్న డబ్బుల్లో కొంత ఇంటికి పంపిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో మృత్యువు అశనిపాతంలా తాకింది. ఈనెల 9వ తేది రాత్రి అతను గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందాడు. మృతదేహం శుక్రవారం గొరగనమూడి చేరుకుంది. మృతదేహాన్ని చూసి మాకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతునికి భార్య నళిని, పాప ఉంది. సర్పంచ్‌చెల్లబోయిన పాపారావు, ఎంపీటీసీ సభ్యుడు పంపన దామోదరం తదితరులు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment