సీఎం పదవికి కిరణ్ ఎందుకు రాజీనామా చెయ్యలేదు?
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శనివారం నిప్పులు చెరిగారు. జులై 30న తెలంగాణ ప్రకటన వెలువడింది... సమైక్యవాదిని అని చెప్పుకుంటున్న ఆయన తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సీఎం కిరణ్ను శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్టాడుతూ... విభజన బిల్లు రాష్ట్రపతికి పంపకముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని తాము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని, అయితే ఆ విషయంలో సీఎం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు.
మీ కింద పని చేస్తున్న వ్యవస్థలే విభజనకు సహకరిస్తున్నాయన్నది వాస్తవం కాదని సీఎంను విలేకర్ల సమావేశంలో బహిరంగంగా అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం విభజన నిర్ణయాన్ని కొంత కాలం వాయిదా వేయాలని సూచించిందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అ విషయం వాస్తవమా కాదా అని సీఎం కిరణ్ను మరోసారి ప్రశ్నించారు.