మురళీ మోహన్ ల్యాండ్ మాట ఏమిటి?
గుంటూరు: రాజధాని ప్రాంతంలో ఆదివారం పర్యటిస్తున్న జనసేన నేత పవన్ కల్యాణ్ తాను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీకి ఒక ప్యత్యేక పరిస్థితుల్లో మద్దతు తెలిపానన్నారు. ఏదిఏమైనా రైతులపై ప్రేమ తప్ప, తెలుగుదేశం, బీజేపీ లపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులపై వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రావెల కిశోర్ మూడున్నర వేల ఎకరాల కోసం ఎందుకింత రాద్ధాంతమన్న వ్యాఖ్యలపై పవన్ విమర్శలు గు ప్పించారు. మురళీ మోహన్ కు ఎందుకు చంద్రబాబు మద్దతు తెలిపారని, మురళీమోహన్ కోల్పోయిన భూమికోసం ఎందుకు పోరాడారని ప్రశ్నించారు. భూమి మీద అపరిమితమైన కోరిక ఉన్న మురళీ మోహన్ కోసం ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. ఆయన దగ్గర పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా అని వ్యాఖ్యానించారు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అంటున్న టీడీపీ నేతలు మురళీ మోహన్ ల్యాండ్ బ్యాంక్ గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆవేశంగా ప్రశ్నించారు. భూసేకరణకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనన్నారు. రైతుల కన్నీళ్లతో నిర్మించే రాజధాని మనకు అవసరం లేదన్నారు.