వాళ్లందరికీ భూమి పిచ్చి పట్టిందయ్యా...!
గుంటూరు: గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా భూమి సేకరణపై రైతులు మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. ఓ మహిళా రైతు ఆవేశంగా తన బాధ వివరించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.
'భూమి పిచ్చి పట్టింది. ఈయనకేకాదు కోడెలకి, వెంకయ్యనాయుడు కూడా భూమి పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. నా ప్రాణం ఇస్తాను కావాలంటే కానీ భూమినివ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. డబ్బును తయారు చేస్తాం.. భూమిని ఎలా తయారు చేస్తారు' ఆమె ప్రశ్నించారు.
వరుస ట్వీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై విరుచుకుపడుతున్న హీరో పవన్ కళ్యాణ్ రైతులకు తన మద్దతు తెలిపేందుకై గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పెనుమాకలో రైతులను కలిశారు.