తాగడానికి డబ్బులివ్వలేదని భార్యను ఓ ప్రబుద్ధుడు చితకబాదాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా వలుగొండ మండల కేంద్రానికి చెందిన లింగన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై భార్య హనుమంతమ్మ(38)ను వేధిస్తున్నాడు. తాగడానికి డబ్బులు ఇవ్వమని విచక్షణారహితంగా కొడుతుండటంతో.. ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాగొచ్చి వేధిస్తున్నాడు..
Published Fri, Jan 29 2016 3:45 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement
Advertisement