అనుమానం పెనుభూతమై.. | wife murdered BY husband | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Apr 24 2016 3:07 AM | Updated on Sep 3 2017 10:35 PM

అందరితో ఎంతో మంచిగా ఉండే మనిషి ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో చూసిన వారు విలవిలలాడారు. కట్టుకున్నవాడే గొంతు

రామచంద్రపురం : అందరితో ఎంతో మంచిగా ఉండే మనిషి ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో చూసిన వారు విలవిలలాడారు. కట్టుకున్నవాడే గొంతు కోసి కడతేర్చాడని తెలియడంతో పట్టణంలోని రాజబాబునగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనుమానమే పెనుభూతం కావడంతో భార్యను గొంతు కోసి హతమార్చిన సంఘటన పట్టణంలో శనివారం రాత్రి సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
  పట్టణంలోని రాజబాబు నగర్‌కు చెందిన ఖండవిల్లి మరియమ్మ(35)కు కె.గంగవరం మండలం పేకేరుకు చెందిన దొరబాబుతో వివాహమయ్యింది. పట్టణంలోని స్టిల్‌వెల్ పేటలో వీరు నివాసముంటున్నారు. దొరబాబు కార్పొరెంటర్‌గా పనిచేస్తుం టాడు.  వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొంత కాలం గా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం తో తరచూ మద్యం తాగి వచ్చి కొడుతుండేవాడు. శనివారం రాజ బాబునగర్‌లో తన అమ్మగారి ఇంటి వద్ద ఉన్న మరియమ్మ వద్దకు వచ్చి గొడవ పడ్డాడు.
 
  వీరు గొడవ పడుతుండగా మరియమ్మ తమ్ముడి భార్య ప్రశాంతి మధ్యలోకి రావటంతో గర్భవతిగా ఉన్న ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో మరియమ్మ తన తమ్ముడు సహాయంతో ప్రశాంతిని రిక్షాలో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఆస్పత్రి గేటు వద్ద వెనుకనుంచి వచ్చిన దొరబాబు  చాకుతో భార్య గొంతుకోశాడు. ఇది గమనించిన ఆమె తమ్ముడు మరియమ్మను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే మృతిచెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. ఎస్సై శ్రీనునాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరియమ్మ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement