సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 10న నిర్వహించబోయే కేబినెట్ సమావేశంపై అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కేబినెట్ సమావేశాలు నిర్వహించరాదు.. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ మే 10న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎస్, అధికారులను బెదిరించి మరీ ఈ సమావేశం నిర్వహించబోతున్నారు.
కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అంగీకారం లేకుండా కేబినెట్ ఎలా జరుగుతుందని అధికారుల్లో చర్చ మొదలైంది. కేబినెట్ అజెండాలను ఆమోదించి అన్ని శాఖలకు పంపాల్సింది సీఎస్ బాధ్యతే. అయితే కోడ్ ఉల్లంఘించి కేబినెట్ అజెండాను సీఎస్ ఇతర శాఖలకు పంపుతారా లేదా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. సీఎంవో నుంచి వచ్చే కేబినెట్ నోట్‌ను సీఎస్ ఆమోదిస్తారా లేదా ఈసీకి పంపుతారా అని అధికారులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సచివాలయంలో సైతం చంద్రబాబు కోడ్ ఉల్లంఘన, బెదిరింపులపైనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment