గుంటూరు జిల్లాలో రైలు కిందపడి గాంధీ అనే చింతలపూడి సొసైటీ కార్యదర్శి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు: తన భర్త గాంధీ ఆత్మహత్యకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో సహా, ఇద్దరు విలేకర్లే కారణమని మృతుని భార్య ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా ఆమె ఆదివారం పొన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. భర్త మరణానికి కారణమైన ధూళిపాళ్ల సహా అందర్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 8 మందిపై కేసు నమోదు చేసినట్టు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం చింతలపూడి సొసైటీ కార్యదర్శి గాంధీ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.