సాక్షి, కాకినాడ:
జిల్లాలో స్త్రీ నిధి పథకాన్ని సక్రమంగా అమలు చేసినపుడే మంచి ఫలితాలు వస్తాయని, తరచు అధికారులు సమీక్షలు చేస్తూ ఈ పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని స్త్రీ నిధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్ రెడ్డి పేర్కొన్నారు. విధాన గౌతమి హాలులో స్త్రీనిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సారథ్యంలో శుక్రవారం జరి గిన వర్క్ షాప్‌లో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పథకం తీరుతెన్నులను ఆయన వివరించారు. ఈ పథకం జిల్లాలో బాగా నడుస్తోందని, అయితే 86 శాతం రికవరీ ఉందని, దీన్ని మరింత పెంచాలన్నారు. ఇరవైనాలుగు మండలాల్లో మాత్రమే షేర్ క్యాపిటల్ కట్టారని, మిగిలిన మండలాలు తక్కువ షేర్ క్యాపిటల్ చెల్లించారన్నారు. డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు మాట్లాడుతూ ఈ నెలాఖరుకు అన్ని మండలాలు రూ.10 లక్షలు షేర్ క్యాపిటల్ కట్టేలా చొరవ తీసుకుంటామన్నారు. డీజీఎం ఎస్.శ్రీనివాస్, ఏరియా కో ఆర్డినేటర్లు, క్లస్టర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
‘స్త్రీనిధి’ రుణ పరిమితి రూ.20 లక్షలు
అన్నవరం: స్త్రీ నిధి పథకం కింద గ్రామ సంఘానికి ఇస్తున్న రుణ మొత్తాన్ని ఈ జనవరి నుంచి రూ.20 లక్షలకు పెంచినట్టు ఇందిరా క్రాంతి పథం మేనేజింగ్ డెరైక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. గతంలో ఈ మొత్తం రూ.పది లక్షలు మాత్రమే ఉండేదన్నారు. తగినంత మూలనిధి ఉన్న, రీ పేమెంట్ సక్రమంగా ఉన్న సంఘాలకి మాత్రమే ఈ పెంపుదల వర్తిస్తుందని తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన అన్నవరంలోగ్రామ సంఘాల ప్రతి నిధుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 25 వేల గ్రామ సంఘాలకు స్త్రీనిధి కింద రూ. 800 కోట్ల రుణాలిచ్చినట్టు తెలిపారు.
స్త్రీ నిధి జిల్లాలో భేష్
Published Sat, Jan 25 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement