
సాక్షి, విజయవాడ: చుట్టూ ఎంతమంది ఉన్నా కుటుంబ సభ్యులు దగ్గర లేకపోతే మనస్సు స్థిమితపడదు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సీతమ్మ వయస్సు 70 సంవత్సరాలు. కృష్ణాజిల్లా పెనమలూరులోని తన కుమార్తె ఇంటికి వచ్చింది. అదే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో ఆమె అక్కడే ఉండిపోయింది. అయితే వలస కూలీలను ప్రభుత్వం తమ స్వస్థలాలకు పంపించేందుకు అనుమతి ఇస్తుండటంతో తనను కూడా స్వగ్రామానికి పంపాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిన్న (మంగళవారం) నడుచుకుంటూ వచ్చి విన్నవించుకుంది. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు వలస కూలీలు)
ఆధార్ కార్డు, ఫోటో, దరఖాస్తు చేతపట్టుకుని వచ్చిన ఆమె విజ్ఞాపనను అక్కడ సిబ్బంది పరిశీలించి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసింది. గమ్యం చేరాలనుకునే బాటసారి అలుపెరగడు... అలాగే విజయం సాధించాలనుకునే వ్యక్తి నిరాశ చెందడన్నట్లుగా సీతవ్వ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. (సాక్షి ఫోటోగ్రాఫర్, విజయవాడ)