కలతచెంది అక్క.. కాపాడబోయి చెల్లెలు | woman Suicide in Kottapeta | Sakshi
Sakshi News home page

కలతచెంది అక్క.. కాపాడబోయి చెల్లెలు

Published Mon, Jul 7 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

కలతచెంది అక్క.. కాపాడబోయి చెల్లెలు

కలతచెంది అక్క.. కాపాడబోయి చెల్లెలు

 కొత్తపేట : భర్తతో మనస్పర్థల వల్ల పుట్టింటిలో ఉంటూ మానసిక వేదనకు గురైన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా ఆమెను అడ్డుకోబోయిన చె ల్లెలు కూడా గల్లంతైన ఘటన కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వాడపాలెం పాత మార్కెట్ ప్రాంతానికి చెందిన పడాల సత్యనారాయణ, జానికమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.  కుమార్తెల పేర్లు నాయుడు మాధవి (33), పడాల వెంకటలక్ష్మి (25). పెద్ద కుమార్తె మాధవిని నాలుగేళ్ల క్రింతం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన నాయుడు రాజకుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది.
 
 అయితే ఆ తర్వాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో మాధవి పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది. భర్త రాజకుమార్ కువైట్‌లో ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో కలత చెందిన మాధవి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి వెనుక నుంచి వెళ్లే బొబ్బర్లంక- ముక్తేశ్వరం కాలువ వద్దకు వెళ్లి అందులోకి దూకడానికి సిద్ధమైంది. ఇంతలో వచ్చిన చెల్లెలు ఆమెను కాపాడేందుకు చేతిని  పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కాలువలో పడిపోయి కొట్టుకుపోయారు. స్థానికులు వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. బండారు పేట వద్ద అక్క మాధవి మృతదేహం లభ్యమైంది. వెంకటలక్ష్మి  కోసం గాలింపు జరుగుతోంది. స్థానికుల సమాచారం మేరకు  కొత్తపేట ఎస్సై ఎ.బాలాజీ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement