మహిళపై దాడి: రూ.14 లక్షల చోరీ | Woman's Rs 14 lakh cash bag stolen in guntur city | Sakshi
Sakshi News home page

మహిళపై దాడి: రూ.14 లక్షల చోరీ

Nov 13 2013 2:56 PM | Updated on Aug 24 2018 2:33 PM

మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న రూ.14 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయిన సంఘటన బుధవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది.

మహిళపై దాడి చేసి ఆమె వద్ద ఉన్న రూ.14 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయిన సంఘటన బుధవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. ఆ దాడిలో మహిళ గాయపడింది.అయితే ఆ మహిళ వెంటనే బ్యాంక్ అధికారులను ఫిర్యాదు చేసింది.  దాంతో బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

 

దాంతో పోలీసులు హుటాహుటిన బ్యాంక్కు చేరుకున్నారు. దుండగులకు సంబంధించిన వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీపురంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ఆ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement