విద్యుదాఘాతంతో యువరైతు దుర్మరణం | young former dead due to electric shock in chittoor district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువరైతు దుర్మరణం

Published Mon, Dec 21 2015 2:19 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

young former dead due to electric shock in chittoor district

చౌడేపల్లి: విద్యుత్ అధికారులు, తోటి రైతుల నిర్లక్ష్యం వల్ల ఓ రైతు ప్రాణాలు బలయ్యాయి. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఊరగపల్లి గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.

బి.వెంకటరమణ (32) ఆవులకు మేత కోసం గాను పొలానికి వెళ్లాడు. పక్క పొలం రైతు తన పొలంలోంచి విద్యుత్ వైర్లు వేసుకున్నాడు. అవి నేలపై ఉండడంతో వాటిని తొలగించాలని వెంకటరమణ విద్యుత్‌శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. విద్యుత్ కనెక్షన్ తొలగించామని వారు చెప్పారు. అవే వైర్లలో విద్యుత్ ప్రసారం కావడంతో వెంకటరమణ సోమవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. యువ రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement