రైలు పట్టాలు దాటుతున్న విద్యార్థిని ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందింది.
బాపట్ల (గుంటూరు): రైలు పట్టాలు దాటుతున్న విద్యార్థిని ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెం సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. బాపట్ల పాల్‌టెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అపర్ణ (17) అనే అమ్మాయి రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని మృతిచెందింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. యువతి మెడలో ఉన్న కళాశాల గుర్తింపు కార్డు సాయంతో అపర్ణగా గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని మృతిచెందిందా.. లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.