రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Published Sat, Feb 27 2016 2:33 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని బంటుమల్లి రోడ్డులో మల్లాయిపాలెం గేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువకుడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడ్ని పామర్రుకు చెందిన దిలీప్‌గా గుర్తించారు. ఈ ఘటనలో గుడివాడకు చెందిన మరో వ్యక్తి కిరణ్‌కు గాయాలు కాగా విజయవాడ తరలించారు. వీరిద్దరూ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు. ఎదురుగా వస్తున్న బొలెరోను తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది.
Advertisement
Advertisement