సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మీ స్థానాలకే పరిమితం కండి. ఇంకొకరి నియోజకవర్గాల్లో వేలుపెట్టొద్దు’ అంటూ జిల్లాలోని సీనియర్ టీడీపీ నేతలను హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ‘‘ మిమ్మల్ని ఇన్నాళ్లు వదిలేశాం. మీ స్థానాలను మీరు గెలవటం చూసుకోండి. మీరడిగినన్ని ఇవ్వటం కుదరదు.’’
అని తేగిసి చెప్పినట్లు సమాచారం. అలాగే నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పనికొచ్చే ఇన్‌చార్జ్‌లను నియమించలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు టీడీపీ చెందిన ఓ ముఖ్యనాయకుడి అనుచరుడు సాక్షికి వివరించారు. అధినేత మాటలతో ఆ పార్టీ నేతలు అసంతృప్తితో తిరిగి వచ్చేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని సేవలు చేస్తుంటే మన మాటకే విలువ ఇవ్వరా..అంటూ వారు ఆగ్రహంతో ఊగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తలోదారి చూసుకుంటున్న తమ్ముళ్లకు పగ్గాలు వేసి తిరిగి పార్టీలో స్థానం కల్పించేందకు అధినేత తలమునకలవుతున్నారు. అందులో భాగంగానే తటస్థంగా ఉంటున్న పార్టీ నాయకులతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మొహమాటానికి కొందరు సరేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా కొందరు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా, అధినేత ధోరణితో జిల్లాలో టీడీపీ పరిస్థితి మారిపోయింది. కొందరు నాయకులు, కార్యకర్తలు పార్టీ వారమని చెప్పుకునేందుకు జంకుతున్నారు. నియోజక ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాలని భావించిన వారు వెనక్కు తగ్గారు. పుట్టిమునిగిన పార్టీ తరుపున అభ్యర్థిగా పోటీ చేయటం కంటే స్తబ్దుగా ఉండటమే మంచిదని కొందరు నాయకులు దూరంగా ఉంటున్నారు.
మీ స్థానాలు మీవే..!
Published Fri, Nov 22 2013 2:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement