'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్' | YS Jagan Mohan Reddy demands to return kakinada sez lands to farmers | Sakshi
Sakshi News home page

'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'

Published Thu, Jul 2 2015 7:36 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్' - Sakshi

'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'

కాకినాడ సెజ్లో భూములన్నీ తనవేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని.. ఇప్పుడు తానే చెబుతున్నా.. ఆ భూములన్నింటినీ రైతులకు తిరిగి ఇచ్చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని పెరుమాళ్లపురంలో గురువారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

  • చంద్రబాబు చేస్తున్న మోసం అంతా ఇంతా కాదు
  • ఆయన రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో పిల్లలు చెడిపోతారు
  • ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి వెధవ పనులు
  • ఎవరైనా మీ నాయకుడు ఎవరంటే, కాలరెగరేసుకుని ఆయన మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి
  • అంతేతప్ప సిగ్గుతో తల దించుకునేలా ఉండాల్సి రాకూడదు.
  • ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు , చేసేవి మోసాలు
  • సెక్షన్ 8 అంటాడు, ఇంకోటి అంటాడు, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తాడు
  • ఇలంటి మోసం చేసే వ్యక్తికి, అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రజలు బంగాళాఖాతంలో పారేసే రోజులు వస్తాయి
  • కాకినాడ ఎస్ఈజడ్ భూముల గురించి నాకు నాయకులు అర్జీలిచ్చారు
  • అక్కడ ఏం జరుగుతోందని అడిగితే ఓ ఫైలు ఇచ్చారు
  • ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు ఇవీ.. 'పేదల భూములతో పెద్దలు వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ సెజ్ భూములు తిరిగి ఇచ్చేవరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది'
  • అందుకే చంద్రబాబును నిలదీస్తూ అడుగుతున్నా
  • ఆ భూములన్నీ నావే అన్నావు కదా.. నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ రైతులకు వెనక్కి తిరిగి ఇచ్చేసెయ్యి
  • ముఖ్యమంత్రి కాకముందు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడాడు
  • కాకినాడ ఎస్ఈజడ్ ఆయన హయాంలోనే వచ్చింది.
  • కానీ తర్వాత ఏరువాక కార్యక్రమం చేస్తాడు, భూములు వెనక్కి ఇస్తామంటాడు, భూములన్నీ జగన్వేనంటాడు
  • నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు
  • కాకినాడ ఎస్ఈజడ్లో ఎకరా 70 లక్షల చొప్పున భూములు అమ్ముకుంటున్నారు.
  • రైతులకు ఇచ్చింది మాత్రం 3 లక్షల రూపాయలు
  • అదే 60-70 లక్షల రూపాయలు రైతులకు ఎందుకివ్వరని చంద్రబాబును అడుగుతున్నా
  • ఆ మొత్తం అన్నా ఇవ్వండి, రైతులకు భూములైనా తిరిగివ్వాలని నిలదీస్తున్నా
  • ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement