kakinada sez lands
-
గుడ్ న్యూస్: కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత పాలకులు స్వలాభంతో అవసరానికి మించి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) కోసం బలవంతంగా సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేస్తోంది. ఇలా సెజ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడమనేది దేశంలోనే ఇది మొదటిసారి. కేఎస్ఈజెడ్ అవసరం మేరకు ఉంచి, బలవంతంగా సేకరించిన భూములను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే భూ యజమానుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తోంది. నిజానికి.. నాడు భూసేకరణ వద్దని ఎదురుతిరిగిన రైతులను చంద్రబాబు సర్కారు వారిని గృహ నిర్బంధంలో పెట్టి భూములను బలవంతంగా లాగేసుకుంది. ఆ సమయంలో నాటి విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేఎస్ఈజెడ్ బాధితుల గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా సేకరించిన భూములను అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. ఆయన సీఎం అయ్యాక ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. రైతుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. దీనిపై బాధిత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్లేటు ఫిరాయించిన ‘బాబు’ కాకినాడ తీరంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుచేసేందుకు అవసరమైన భూముల సేకరణకు చంద్రబాబు సర్కార్ 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2006 నుంచి 2011 మధ్య భూ సేకరణ జరిగింది. ప్రభుత్వం 3,400.13 ఎకరాలు కొనుగోలు చేసి, కేఎస్ఈజెడ్కు ఇవ్వగా, 4,558.39 ఎకరాలను సెజ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 2,180 ఎకరాలకు చెందిన 1,307 మంది రైతులు అవార్డు తీసుకోలేదు.. భూములూ ఇవ్వలేదు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న వైఎస్సార్ 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆయన రైతులకు ఇబ్బందిలేని రీతిలో భూ సేకరణ జరగాలని ఆదేశించారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు రైతుల నోట మట్టికొట్టిన చంద్రబాబు.. అధికారం కోల్పోయేసరికి ప్లేటు ఫిరాయించారు. అక్రమంగా భూములు దోచుకుంటున్నారని, సెజ్‌ను రద్దుచేసే వరకూ నిద్రపోనని, అధికారంలోకి వచ్చాక సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. భూములను వైఎస్ కుటుంబమే కొనుగోలు చేసిందనే దుష్ప్రచారం చేశారు. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ మాట మార్చారు. తన బినామీలకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో రైతుల నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సెజ్ బాధిత గ్రామాలపై పోలీసులు ఉక్కుపాదం మోపి, అనేకమందిపై అక్రమ కేసులు పెట్టారు. ఆ సమయంలో ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ కేఎస్ఈజెడ్ గ్రామమైన పెరుమాళ్లపురంలో పర్యటించారు. ‘సెజ్ భూములు నావేనని చంద్రబాబు అంటున్నారు. అదే నిజమైతే భూములన్నీ మీరే తిరిగి తీసేసుకోవచ్చు’ అని జగన్ ప్రకటించారు. అవసరానికి మించి చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములను ఆయా రైతులకు తిరిగి ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటను అమలుచేసేందుకు సీఎం జగన్ ఇప్పుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 148 ఎకరాలను 478 మంది రైతుల పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రెండు మండలాల్లో 597 ఎకరాలను భూమికి భూమి పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
కాకినాడ సెజ్: 'సాగర' తీరానికి భారత్‌మాల
పచ్చని చెట్లు.. తెల్లని ఇసుక తిన్నెలు.. పక్కనే సముద్రం.. ఆనుకుని సన్నటి రోడ్డు.. ఈ తీర ప్రాంతం రానున్న రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా మారనుంది. ఇప్పటికే కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్‌మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే çప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్దం చేశాయి. ఈ ప్రాజెక్టు ఫలితంగా తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా రూపు మారబోతోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణంతో పాటు, కాకినాడ సెజ్ భూముల వివాదానికి పరిష్కారం చూపించడంతో ఇందుకు కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో పోర్టు, అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్‌హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణాలకు చర్యలు మొదలవుతున్నాయి. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా కేంద్రానికి చేరువలోని తీరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. కాకినాడ పోర్టు ఏరియాలోని హార్బర్ మాత్రమే ఇప్పటి వరకూ మత్స్యకారులకు.. వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతోంది. ప్రభుత్వ చొరవతో తాజాగా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మేజర్ హార్బర్ రూపుదిద్దుకోనుంది. రూ .422 కోట్ల వ్యయంతో ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (వర్చువల్ విధానంలో) శంకుస్థాపన చేయడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో కొత్తపల్లి , తొండంగి, తుని మండలాల్లో సుమారు 25 గ్రామాలకు చెందిన మత్స్యకార కుటుంబాలకు ఇది చేదోడు వాదోడు కానుంది. 2,500 బోట్లు నిలుపుకోడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ నిర్మాణంతో ఇక్కడి మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పారిశ్రామిక హబ్‌గా కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ సమస్యకు సీఎం వైఎస్ జగన్ చొరవ తీసుకుని పరిష్కారం చూపించడంతో సెజ్ పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇవ్వడానికి ..ఆరు గ్రామాలను సెజ్‌లో విలీనం చేయకుండా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పరిశ్రమల స్థాపన.. రైతులకు తిరిగి ఇచ్చే భూములను గుర్తిస్తున్నారు. త్వరలో సెజ్ భూముల్లో పరిశ్రమల స్థాపనకు వడివడిగా చర్యలు మొదలయ్యాయి. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద రూ.2,123 కోట్లతో పోర్టు నిర్మించనున్నారు. దీనికోసం 165 ఎకరాల భూమి సేకరించి కాకినాడ సీపోర్టు అధికారులకు అప్పగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇది రెండో పోర్టు. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ జాతీయ రహదారి నిర్మాణం ► కాకినాడ–తుని తీరప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. ► కాకినాడ రూరల్ మండలంలో తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కసపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. ► నాలుగు లైన్ల రహదారికి అవసరమైన 180 ఎకరాలు సేకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ► అన్నవరం నుంచి కాకినాడ వరకు 40. 319 కిలో మీటర్ల నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. భూసేకరణకు ప్రణాళికలు భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు సంబంధించి ప్రణాళికలను జేసీకి పంపించాం. నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సేకరించాల్సిన భూములను గుర్తించడంతో నోటిఫికేషన్ విడుదల చేయగానే భూసేకరణ ప్రారంభిస్తాం. భూసేకరణకు అభ్యంతరాలు తెలుపుకునే అవకాశం ఇవ్వనున్నారు. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. – చిన్నికృష్ణ, ఆర్డీఓ కాకినాడ -
కాకినాడ సెజ్ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే
సాక్షి, అమరావతి: కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కే – సెజ్)కి సంబంధించి రైతుల భూముల విషయంలో గత 15 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాకినాడ సెజ్ కోసం గత సర్కారు హయాంలో రైతుల నుంచి బలవంతంగా 2,180 ఎకరాలు తీసుకోవడం తెలిసిందే. దీంతో రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న 2,180 ఎకరాలను తిరిగి వారికే ఇవ్వాలని దీనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇతర సిఫారసులు ఇవీ: స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించడంలో భాగంగా ఆరు గ్రామాలను తరలించరాదని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవాపురం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని, రామరాఘవాపురంను తరలించాల్సి వస్తే రావివారిపోడు గ్రామానికి తరలించాలని కమిటీ సిఫార్సు చేసింది. ► పునరావాసం లేని నివాసాలకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలను ఆ గ్రామాలకే వదిలివేయాలని, వాటిని తరలించరాదని కమిటీ పేర్కొంది. అలాంటి శ్మశాసవాటిక స్థలం పరిశ్రమ కోసం అవసరమైతే ప్రత్యామ్నాయ భూమిని కేఎస్ఈజెడ్ గ్రామస్థులకు కల్పించాలని కమిటీ పేర్కొంది. ► నిషేధిత ఆస్తుల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం కేసులను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. కేఎస్ఈజెడ్ కోసం తీసుకున్న 657 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి కోన గ్రామానికి చెందిన రైతులు పరిహారం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అదనంగా ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.పది లక్షలు పరిహారం ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దివీస్ ల్యాబ్‌కు చెందిన అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని సిఫార్సు చేసింది. ► సెజ్ కోసం భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన క్రిమినల్ కేసులను సమీక్షించడంతో పాటు అవకాశమున్న వరకు కేసులను ఉపసంహరించాలని కమిటీ సిఫార్సు చేసింది. సెజ్‌లో స్థానిక నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని సిఫార్సు చేసింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కే–సెజ్‌తో పాటు దివీస్ భూముల పరిసరాల్లో సరైన ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, హేచరీస్ ప్రభావం పడకుండా సముద్ర ప్రవాహానికి దూరంగా తరలిం చాలని సూచించింది. పాదయాత్ర హామీ మేరకు కమిటీ పాదయాత్ర హామీ మేరకు కాకినాడ సెజ్‌లో రైతుల సమస్య పరిష్కారానికి మంత్రి కన్నబాబు నేతృత్వంలో కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ రైతులతో పాటు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట సమితితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన, అన్నదాతలకు మేలు జరిగేలా సిఫార్సులను చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిఫార్సులతో కూడిన కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నందున కే – సెజ్ కోసం జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ చేసిన సిఫార్సును కేబినెట్ ఆమోదించింది. సెజ్ బాధితుల హర్షం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం పిఠాపురం: కేబినెట్ నిర్ణయంపై ఇక్కడి సెజ్ బాధిత రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కొన్నేళ్ల క్రితం కాకినాడ సెజ్ పేరుతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంతో పాటు తుని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్థానిక రైతులు ఆందోళనలు చేస్తూ వచ్చారు. 2012లో చంద్రబాబు ఇక్కడకు వచ్చి అధికారంలోకి రాగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తమను కేసులతో ఇబ్బందులకు గురిచేసినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం వచ్చిన జగన్ దృష్టికి రైతులు తమ సమస్య తీసుకువచ్చారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సెజ్ గ్రామాల నాయకులు -
'నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ ఇచ్చెయ్'
కాకినాడ సెజ్‌లో భూములన్నీ తనవేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారని.. ఇప్పుడు తానే చెబుతున్నా.. ఆ భూములన్నింటినీ రైతులకు తిరిగి ఇచ్చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని పెరుమాళ్లపురంలో గురువారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు చేస్తున్న మోసం అంతా ఇంతా కాదు ఆయన రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో పిల్లలు చెడిపోతారు ఆయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి వెధవ పనులు ఎవరైనా మీ నాయకుడు ఎవరంటే, కాలరెగరేసుకుని ఆయన మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి అంతేతప్ప సిగ్గుతో తల దించుకునేలా ఉండాల్సి రాకూడదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు , చేసేవి మోసాలు సెక్షన్ 8 అంటాడు, ఇంకోటి అంటాడు, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తాడు ఇలంటి మోసం చేసే వ్యక్తికి, అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రజలు బంగాళాఖాతంలో పారేసే రోజులు వస్తాయి కాకినాడ ఎస్ఈజడ్ భూముల గురించి నాకు నాయకులు అర్జీలిచ్చారు అక్కడ ఏం జరుగుతోందని అడిగితే ఓ ఫైలు ఇచ్చారు ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాటలు ఇవీ.. 'పేదల భూములతో పెద్దలు వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ సెజ్ భూములు తిరిగి ఇచ్చేవరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది' అందుకే చంద్రబాబును నిలదీస్తూ అడుగుతున్నా ఆ భూములన్నీ నావే అన్నావు కదా.. నేనే చెబుతున్నా.. ఆ భూములన్నీ రైతులకు వెనక్కి తిరిగి ఇచ్చేసెయ్యి ముఖ్యమంత్రి కాకముందు నోరు తెరిస్తే అబద్ధాలు ఆడాడు కాకినాడ ఎస్ఈజడ్ ఆయన హయాంలోనే వచ్చింది. కానీ తర్వాత ఏరువాక కార్యక్రమం చేస్తాడు, భూములు వెనక్కి ఇస్తామంటాడు, భూములన్నీ జగన్వేనంటాడు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు కాకినాడ ఎస్ఈజడ్లో ఎకరా 70 లక్షల చొప్పున భూములు అమ్ముకుంటున్నారు. రైతులకు ఇచ్చింది మాత్రం 3 లక్షల రూపాయలు అదే 60-70 లక్షల రూపాయలు రైతులకు ఎందుకివ్వరని చంద్రబాబును అడుగుతున్నా ఆ మొత్తం అన్నా ఇవ్వండి, రైతులకు భూములైనా తిరిగివ్వాలని నిలదీస్తున్నా ఈ పోరాటం ఇంతటితో ఆగదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది.