
సాక్షి, అమరావతి: సమాజంలోని మహిళామణులందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సెల్యూట్ చేశారు. వారి గౌరవ మర్యాదలను ఎల్లప్పుడు కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ప్రతి అమ్మకు, భార్యకు, కుమార్తెకు, సోదరికి నేను సెల్యూట్ చేస్తున్నాను. మీ వల్లే మా జీవితాలు మెరుగ్గా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటున్నాయి. మీ గౌరవమర్యాదలను ఎల్లప్పు డూ కాపాడుతామని వాగ్దానం చేస్తున్నాం..’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
I salute every mother, wife, daughter and sister. Your presence makes our lives happier, peaceful and better in every way. We pledge to cherish and respect you this day and always. #HappyWomensDay2019
— YS Jagan Mohan Reddy (@ysjagan) 8 March 2019