సాక్షిప్రతినిధి విజయనగరం: జననేత అడుగిడిన చోట జాతర జరిగినట్టు కనిపిస్తోంది. మహిళా లోకం వెల్లువలా కదలి వచ్చింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా కష్టాలు తీర్చే నాయకుడి కోసం దారి పొడవునా నిరీక్షించింది. ప్రజా సంకల్పయాత్ర ద్వారా చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. రోజంతా అతని వెంటే అడుగులు వేసింది. ఆ సమయంలో ఒక మహిళ కాలిచెప్పులు ఊడిపోతే ప్రతిపక్షనేత స్వయంగా చెప్పులు చేతితో పట్టుకుని ఆమె కాలికి తొడిగారు. మహానేత బిడ్డ తమపై చూపించిన మమకారానికి అక్కడి మహిళలు ముగ్దులైపోయారు. వేలాది మంది మహిళల జయ జయధ్వానాల నడుమ 279వ రోజు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సాగింది.
నెల్లిమర్ల నుంచి చీపురుపల్లికి...
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో జన ప్రభంజనం నడుమ దిగ్వియవంతంగా సాగుతోంది. శనివారం నాటికి శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి చేసుకుంది. 279వ రోజు నెల్లిమర్ల నియోజకవర్గంలోని మూలస్టేషన్ వద్ద గల రాత్రి బస నుంచి ప్రారంభమైన పాదయాత్ర పూర్తిగా పల్లె ప్రాంతాల్లో సాగింది. ఎస్.ఎస్.ఆర్.పేట, సొలిపి క్రాస్ వరకూ సాగి అక్కడ మధ్యాహ్న భోజనానంతరం మన్యపురిపేట, బెల్లానపేట, వల్లాపురం క్రాస్ మీదుగా కెల్ల గ్రామం శివారుకు చేరుకుంది.
పల్లె పరవశం
పల్లెలు పరవశించాయి. తమ అభిమాన జననేత జగన్‌మోహన్ రెడ్డిని చూసి మురిసిపోయాయి. మండుటెండ ను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేపడుతున్న అభిమాన నేతకు ఆప్యాయంగా హారతులతో ఘన స్వా గతం పలికాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండల పరిధిలో సాగిన పాదయాత్రకు దారిపొడవునా నీరాజనాలు పట్టాయి. ముందుగా వేదపండితులు ఆశీర్వదించగా... డప్పు వాయిద్యాలు ... జానపద కళా రూపాల ప్రదర్శనలు... సాంస్కృతిక కార్యక్రమాల నడుమ రోజంతా పాదయాత్ర సాగింది. జై జగన్ అంటూ జగన్నినాదం మిన్నంటింది. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో రాజన్న పాలనలో చూశాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయాం. అన్నా ఓట్టేసి చెబుతున్నాంఈ సారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అంటూ వేలాది మహిళలు ఒక్కటై నినదించారు. ప్రతి చోట ప్రజలతో మమేకమై జననేత వారి సమస్యలు తెలుసుకుని కొండత భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు.
అడుగడుగునా సమస్యల వెల్లువ
దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. సాక్షరభారత్ మిషన్‌లో పని చేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించటంతో తమకు ఉ పాధి లేక రోడ్డున పడ్డామని కొందరు... మన్యపురిపే ట శివారుల్లో జననేతను ఫెర్రోఎల్లాయిస్ కంపెనీ ప్రతి నిధులు పలువురు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. విద్యుత్‌పై ఆధారపడి నడిచే పరిశ్రమలకు రాయితీపై సరఫరా చేయాల్సి ఉండగా... ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. దీనివల్ల మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాం ట్రాక్ట్ ఉద్యోగులను ఏళ్లు గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మణ్యపురిపేటలో జననేతను కలిసిన వెంకటలక్ష్మి తనను అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని, చివరికి ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయింది. అక్కడి నుంచి బెల్లానపేటకు చేరుకున్న జననేతను యాదవులు కలిసి గొర్రె పిల్లను బహూకరించారు. పలు కారణాలు చెప్పి తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో రేషన్‌దుకాణం లేక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెల్లకు వెల్లి నిత్యవసర వస్తువులు తెచ్చుకోవాల్సి వస్తోందని అక్కడివారు ఫిర్యాదు చేశారు.
అధినేత వెంట అడుగులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు నాగి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.భరత్‌కుమార్‌రెడ్డి, కోస్తా జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శి త్రినాథ్‌రెడ్డి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, విజయవాడ సిటీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గున్నం నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొం డ అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు, ఎస్‌కోట నియోజ కవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, డీసీఎం ఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములునాయుడు, సీనియర్ నాయకులు రూపానంద్‌రెడ్డి, యువజన నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు విజయ్, హర్షవర్ధన్‌రా>జు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment