పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ రోడ్షో
బ్రాహ్మణగూడెం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'వైఎస్సార్ జనభేరి' పేరిట తలపెట్టిన ఎన్నికల శంఖారావం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆయన బ్రాహ్మణగూడెంలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న తనయుడిని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. వారందరికీ అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. కొవ్వూరులో రోడ్షో అనంతరం వైఎస్ జగన్ రాజమండ్రి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ సెంటర్లో జనభేరి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.